2 July, 2026 | 2:18 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

ప్రధాని మోదీకి తొలి సెమీ కండక్టర్ చిప్ అందజేత

03-09-2025 01:23 AM

విక్రమ్ నామకరణం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: దేశరాజధాని న్యూఢిల్లీ సెమీకాన్ ఇండియా సదస్సు జరిగింది. ఇందులో భాగంగా ఇండియాలో తయారయిన తొలి 32 బిట్ సెమీకండక్టర్ చిప్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అందజేశారు. దేశీయంగా తయారయిన ఈ 32 బిట్ సెమీకండక్టర్ చిప్‌కు విక్రమ్‌గా నామకరణం చేశారు. సెమీకండక్టర్లు ‘డిజిటల్ డైమండ్స్’ అని ప్రధాని మోదీ అభివర్ణించారు.

నూతన యుగంలో సెమీకండక్టర్స్ డిజిటల్ డైమండ్, ఆయిల్ బ్లాక్ గోల్డ్ అని మోదీ పేర్కొన్నారు. ‘కొన్నేళ్ల క్రితం మోదీ విజన్ వల్ల ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించాం. కేవలం మూడున్నర సంవత్సరాల్లోనే తొలి సెమీకండక్టర్‌ను ప్రధానికి అందజేశాం. నేడు ఐదు సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి’ అని తెలిపారు.