21 March, 2026 | 8:53 PM

జోర్డాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ

16-12-2025 01:47 AM
  1. ఆపూర్వ స్వాగతం పలికిన ఆ దేశ ప్రధాని
  2. 7 ఏళ్ల తర్వాత చరిత్రాత్మక పర్యటన

అమ్మాన్, డిసెంబర్ 15: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల విదేశీ పర్యటనను సోమవారం ప్రారంభించారు. దీనిలో భాగంగానే తొలిరోజు జోర్డాన్ చేరుకున్నారు. ఏడేళ్ల తర్వాత ప్రధాని మళ్లీ జోర్డాన్‌కు వెళ్లారు. అమ్మాన్ విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా మోదీకి స్వాగతం పలికారు. మోదీకి ఆతిథ్యమిచ్చిన హోటల్ వద్ద జోర్డాన్‌లోని ఎన్‌ఆర్‌ఐలు భారత జాతీయ జెండాను చేతబట్టి స్వాగతం చెప్పారు.

ఈ సందర్భంగా ప్రధాని వారిని ప్రేమతో పలుకరించారు. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారత ప్రధాని ఒకరు జోర్డాన్‌లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. తన రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ.. జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుస్సేన్‌తో సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. తర్వాత మోదీ ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటిస్తారు.