calender_icon.png 24 September, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

24-09-2025 12:33:44 AM

రాజాపూర్, సెప్టెంబర్ 23: పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశమని బిజెపి మండల అధ్యక్షుడు ఆనంద్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జీఎస్టీ ధరలు భారతదేశం అన్నిరకాల వస్తువుల ధరలు తగ్గించడం,తగ్గిన ధరలు సోమవారం నుండి అందరికీ అందుబాటులోకి రావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రధాని దసరా కానుకగా పేదా మధ్యతరగతి ప్రజలకు నిత్యవసర వస్తువులు,ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు,కంప్యూటర్లు, ఇలా ప్రతి దాని పైన కూడా ధరలు తగ్గించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ధరలు పేరుదల పై ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ పైన బురదజల్లే కార్యక్రమం చేశారు. నిత్యవసర వస్తువులు తగ్గించినందుకు ఇది చూసైనా ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ పైన ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నర్సింలు,శేఖర్,రాజు,గంగాధర్ గౌడ్, ఆదిత్య, బాలరాజ్, నర్సింహా,తదితరులు పాల్గొన్నారు.