24-09-2025 12:32:56 AM
ప్రతిష్ఠాత్మక ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరం--15కు ఆతిథ్యం
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఎస్‌ఎంపీ యూనివర్సల్ స్కూల్ ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరం--15కు ఆతిథ్యమిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఈ నెల 23న ప్రారంభమై, అక్టోబర్ 1 వరకు కొనసాగుతుంది. ఈ శిబిరాన్ని పాఠశాల చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి శుభారంభం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదా పు 700 మంది ఎన్‌సీసీ కేడెట్లు శిబిరంలో పాల్గొంటున్నారని, ఇందులో క్రమశి క్షణ, ధైర్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా రూపొందించిన డ్రిల్స్, వర్క్‌షాప్‌లు, ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించబడతాయని తెలిపారు. ఎస్‌ఎంపీ యూనివర్సల్ స్కూల్‌కు ఈ ప్రతిష్ఠాత్మక శిబిరానికి ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు.
విద్యా రంగాన్ని మించి విలువలతో విద్యార్థులను శక్తివంతం చేయ డం మా పాఠశాల ధ్యేయానికి ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ శిబిరానికి క్యాంప్ చీఫ్ లెఫ్టినెంట్ కర్నల్ ఎఎస్. పాండియన్ మార్గనిర్దేశకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార స్పాండెంట్ పి.చంద్రకళ, డైరెక్టర్లు డా. శ్వేత వి.రెడ్డి, ఈ.భవ్యరెడ్డి, పి.దివ్యరెడ్డి, మిస్ రోషిని డి’సోజా, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.