21 April, 2026 | 11:17 PM

ఎములాడకు పైసా ఇవ్వని ప్రధాని

09-05-2024 02:49 AM

వందల కోట్లతో కాశీని మాత్రం అభివృద్ధి చేశారు

కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్ 

కరీంనగర్, మే 8 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి(కాశీ)ని వందల కోట్లతో అభివృద్ధి చేశారని, వేములవాడను విస్మరించారని కరీంనగర్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. బుధవారం కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వేములవాడ రాజన్న గుడికి మోదీ రూపా యి నిధులు ప్రకటించలేదని, మోదీ పర్యటన రాజకీయాల కోసమేనని మండిపడ్డారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన వేములవాడ దేవస్థానం గురించి ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క హామీ కూడా మోదీ ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రం ప్రసాద్ అనే పథకం ప్రవేశ పెట్టి వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలను ఒక సర్క్యూట్ చేయాల ని తాను అడిగానని గుర్తుచేశారు. 32 ఎకరాల గుడి చెరువులో మట్టి నింపి వేములవాడ రాజన్న గుడిని బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి చేశామని స్పష్టంచేశారు.

మోదీ కనీసం హామీ కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేసే బండి సంజ య్.. వేములవాడ గుడి కోసం నిధులు ఇవ్వాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాల ఏర్పా టు, ఇరిగేషన్ ప్రాజెక్టుల జాతీయ హోదా గురించి ఎందుకు అడగలేదని, ఎంపీగా తన బాధ్యతలను బండి సంజయ్ పూర్తిగా విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రాదనే అసహనంతో మోదీ నిరాశకు గురవుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల రిజ ర్వేషన్లు గుంజుకునే హక్కు ఎవరికి లేదని చెప్పారు. తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారో చెప్పమంటే మోదీ సభలో ఏం చెప్పలేదని ఆరోపించారు. అభివృద్ధి చేసే బీఆర్‌ఎస్ పార్టీ కావాలో, దేవుడి పేరుతో రాజకీయాలు చేసే బండి కావాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తేల్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, భానుప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.