19 May, 2026 | 2:10 AM

ప్రకృతి వైపరీత్యాలలో ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరం

19-05-2026 01:04 AM

వరద విపత్తులపై మాక్డ్రిల్ నిర్వహణ

నాగిరెడ్డిపేట్ మే 18 (విజయ క్రాంతి):ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు,ఎలా సంభవిస్తాయో ముందుగా ఊహించడం సాధ్యం కాదని,ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధత ఎంతో అవసరమని విపత్తు నిర్వహణ బృందం తెలిపారు.నాగిరెడ్డిపేట్ మండలంలోని చీనూర్ గ్రామంలోని గండి వద్ద ప్రాంతంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం,భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ  యాన్.డిఎం.ఏ సహకారంతో వరద విపత్తులపై మాక్ ఎక్స్సజ్ నిర్వహించారు.గత ఏడాది ఆగస్టులో నాగిరెడ్డిపేట్ మండలంలో జరిగిన వరదలు వస్తే ఎలాంటి  చర్యలు తీసు కున్నారు వంటి విషయాలను వివరించారు.

రిస్క్యూ బృందాలు ప్రాణాపాయ పరిస్థితుల్లో పాటించాల్సిన జాగ్రత్తలు,బాధితులను రక్షించే విధానాలను ప్రత్యక్షంగ మాకు డ్రిల్ ద్వారా వివరించారు.వరద నీరు ఇళ్లలోకి చేరుతున్నప్పుడు భయపడకుండా ప్రశాంతంగా ఆలోచించి వెంటనే ఎత్తున సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.ముందస్తు హెచ్చరికలను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చినుర్, వాడి గ్రామాల సర్పంచులు మురళి గౌడ్, మహేందర్, డిఎల్పిఓ సురేందర్, ఎమ్మార్వో బిక్షపతి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రభాకర్ చారి,ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సృజన్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ పిచ్చయ్య, ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యం చారి, కార్యదర్శులు సంతోష్ కుమార్, కార్తీక్, నరేష్, సురేందర్, గ్రామ పెద్దలు గుర్రాల సిద్దయ్య, గంపల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.