పీహెచ్‌సీలో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం
12-08-2026 01:26 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు 11 మండల కేంద్రం అర్వపల్లిలోని పీహెచ్సీలో సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్ తెలిపారు.మంగళవారం నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన రెంటాల వినయ్ భార్య లావణ్యకు పీహెచ్సీలో మొదటి కాన్పుగాను సాధారణ ప్రసవం చేశారు.
దీంతో 3.5 కిలోల బరువు ఉన్న ఆడశిశువుకు జన్మనిచ్చింది.తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారని, ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని,మహిళలు ప్రసవాల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి డబ్బులు వృధా చేసుకోవద్దని వైద్యాధికారి నగేష్ సూచించారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్లు సునిత,మాధవి,ఎంఎల్ హెచ్పీ వశ్రిత,శైలజ,ఆశా అనిత,నోడల్ పర్సన్ కుంభం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.






