calender_icon.png 14 August, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం

13-08-2025 12:03:37 AM

  1. అన్ని హంగులతో కొడంగల్ ఆలయాన్ని తీర్చిదిద్దాలి
  2. టీటీడీ తరహాలో ఆరెకరాల్లో నిర్మించాలి..
  3. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం, దౌల్తాబాద్ వేంకటేశ్వరస్వామి ఆలయం, కోస్గి శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధిపై మంగళ వారం హైదరాబాద్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు.

కొడంగల్ ఆలయాన్ని టీటీడీ తరహాలో ఆరెకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సంద ర్భంగా అధికారులు ఆలయాభివృద్ధికి సం బంధించిన ప్రాకార మండపం, మాడ వీధు లు, భూ వరాహస్వామి ఆలయం, గర్భగుడి, మహా మండపం డిజైన్లను సీఎం ముందు ఉంచారు. అలాగే సీఎం దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లనూ పరిశీలించారు.

అధికారులకు వాటిపై అనేక సూచనలు, సలహాలిచ్చారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్యకార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాసరాజు, కార్యదర్శి మాణిక్‌రాజ్, దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.