13-08-2025 12:05:10 AM
జనగామ, ఆగస్టు 12 (విజయ క్రాంతి): ఈనెల 13లోపు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి తమ కొత్త పట్టా పాస్బుక్లతో ఈనెల 13లోపు రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంబికా సోని తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి, జూన్ 5 వరకు కొత్త పాస్బుక్లు పొందిన రైతులు, రైతుబీమా పథకం-2025 పాలసీలో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏఈవోలు రైతుబీమా వివరాల నమోదు కార్యక్రమాన్ని వేగంగా చేపడతారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.