సహచట్టం సాధన సమితి కమిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి
భూపాలపల్లి టౌన్, ఆగస్టు 12 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం సాధన సమితి కమిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు తోట సురేష్ కోరారు. జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి సూచన మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు పలు డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. జిల్లాలో సమాచార హక్కు చట్టం-2005 సమగ్ర అమలుకు జిల్లా స్థాయి కమిటీ, మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.
కలెక్టర్ కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వానికి, సమాచార కమిషన్కు తమ కమిటీని సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రఘపతి, సాయి, మారెల్లి కిరణ్, రావుల రమేష్, బద్రి, హరిబాబు, కాసాని దేవేందర్, రాజశేఖర్, శివప్రసాద్, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






