15-11-2025 01:58:06 AM
కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌లో ఘటన
నాగర్ కర్నూల్, నవంబర్ 14 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీసులు దొంగతనం కేసులో విచారణ నిమిత్తం కల్వకుర్తి ఠాణాకు తీసుకొచ్చిన ఒక అంతర్రాష్ట్ర రిమాండ్ ఖైదీ పరారైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.
ఏపీలో ని అనంతపురం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగిరెడ్డి ఒక కేసు విచారణలో భాగంగా కల్వకుర్తి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లాల్సి ఉందని చెప్పి బాతురూమ్‌లోకి వెళ్లిన నాగిరెడ్డి కిటికీలో నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. దివ్యాంగుడైన రిమాండ్ ఖైదీ కిటికీ నుంచి ఎలా పారిపోయాడని పలువురు ప్రశ్నిస్తున్నారు.