calender_icon.png 15 November, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేసి చూపిస్తాం

15-11-2025 01:59:14 AM

-జూబ్లీహిల్స్ విజయం.. మా బాధ్యతను మరింత పెంచింది 

-కేటీఆర్ అహంకారం.. హరీశ్ అసూయ తగ్గించుకోవాలి 

-17న జరిగే క్యాబినెట్ సమావేశంలో  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ 

-కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సహకరించాలి 

-కిషన్‌రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు 

-హైదరాబాద్ అభివృద్ధ్దికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం 

-మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆదాయంలో 65 శాతం వరకు హైదరాబాద్ నుంచే వస్తోందని, నగ రానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మరింత అభివృద్ధ్ది చేసి చూపిస్తామని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌ను సమస్యల రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకం పెరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ గెలుపొందిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని  సీఎం క్యాంప్ ఆఫీసులో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

నవీన్ యాదవ్ విజయానికి కృషిచేసిన మంత్రులు, పార్టీ శ్రేణులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు సరైన ఫలితాలు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లు వచ్చా యి. 6 నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాకు ఓట్ల శాతం 42 శాతానికి పెరిగింది. 8 ఎంపీ సీట్లు గెలిచాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు 51 శాతం ఓట్లను ప్రజలు ఇచ్చారు.

అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. గెలుపోటములకు కాంగ్రెస్ పార్టీ పొంగదు, కుంగిపోదు. ప్రతిపక్షంలో ఉ న్నప్పుడు ప్రజల తరపున నిలబడటం, అధికారంలో ఉన్నప్పుడు సమస్యలను పరిష్క రించడమే కాంగ్రెస్ కర్తవ్యం. జూబ్లీహిల్స్‌లో తమ పార్టీకి మద్దతిచ్చిన ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, ఇతర కుల, ప్రజా సంఘాలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. కాం గ్రెస్ ఒక్కతాటిపై ఉన్నప్పుడు ఎవరి తాతలు దిగొచ్చినా ఓడించలేరని స్పష్టం చేశారు.  

కిషన్‌రెడ్డి సహాయ నిరాకరణ..

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘మెట్రో రైలు విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ ప్రక్షాళణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, కృష్ణా, గోదావరి జలాలు నగరానికి తరలింపు వంటి సహా అనేక ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు. కిషన్‌రెడ్డి ఎంపీగా ఉన్న పార్లమెంట్ నియోజక వర్గపరిధిలోని జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఓ ట్లు బాగా తగ్గాయి. ఎంపీ ఎన్నికల్లో కిషన్‌రెడ్డికి 67 వేల ఓట్లు వస్తే.. ఇప్పుడు 17 వేలకు ఎందుకు తగ్గాయో కిషన్‌రెడ్డి ఆలోచించుకోవాలి. ఆయన వ్యవహారశైలిని ప్రజలు గమ నించారు. భూకంపానికి ముందు వచ్చే ప్రకంపనంగా జూబ్లీహిల్స్ ఫలితాన్ని బీజేపీ చూడాలి.

తీరు మారకుంటే భూకంపం వం టి ఫలితాలు బీజేపీకి వస్తాయి. రాజకీయా లు మాని.. రాష్ట్ర అభివృద్దికి కేంద్ర మం త్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కలిసి రావాలి. రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చే బాధ్యతను కేంద్ర మం త్రులు, బీజేపీ ఎంపీలపై ఉంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇప్పుడైనా మేల్కొని సచివాలయానికి రావాలని.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించి.. కలిసి సాధించుకుందా మన్నారు. పెండిండ్ పనులకు సంబంధించి నివేదిక రూపంలో ఎంపీలకు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. 

ఆ పార్టీల గురించి ముందే చెప్పా.. 

‘అధికారం పోయినా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు.. అసూయ పోలేదు. పదవు లు ఎవరికి శాశ్వతం కావు. కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. హరీశ్‌రావు అసూయ తగ్గించుకోవాలి. మనం ఇంకా చాలా ఏళ్లు రాజకీ యాలు పనిచేయాల్సి ఉంది. మీడియాలో ఫేక్ న్యూస్ రాయించి.. ఫేక్ సర్వేలు చేయించుకొని భ్రమలో బతకొద్దు. బీఆర్‌ఎస్ ఓడిపోతుంది.. బీజేపీకి డిపాజిట్ రాదని ముందే చెప్పాను’ అని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

బీహార్ పలితాలపై ఇంకా తను సమీక్షించలేదన్నారు. ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయన్నారు. హైడ్రా, ఈగల్ వంటి సం స్థలు హైదరాబాద్ అభివృద్ధి కోసమే తెచ్చినట్లు తెలిపారు. కానీ వాటిపైనే బీఆర్‌ఎస్ దృష్టి పెట్టి మరీ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ప్రజలు వాస్తవాన్ని గుర్తించి ఓటు వేశారని తెలిపారు.

సోషల్ మీడియాలో విషప్రచారం చేయడం ఇకనైనా బీఆర్‌ఎస్ నేత లు ఆపాలని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పు డే రాజకీయాలు చేస్తామని.. మిగతా సమయంలో రాష్ర్ట అభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఈనెల 17న జరి గే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణ యం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి తె లిపారు.  ఈ మంత్రివర్గ సమావేశానికి ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. 

కేసీఆర్ ఆరోగ్యం సరిగా లేదు 

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం పై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యేలా కూడా కని పించడం లేదు. కేటీఆర్, హరీశ్‌రావును ముందు వరుసలో నిల్చోబెడితే.. బీఆర్‌ఎస్ పరిస్థితి ఇలాగే ఉంటుంది. కేసీఆర్ మొఖం చూసి బీఆర్‌ఎస్‌కు ఓటు వేసేవాళ్లు కూడా వీరిద్దరు గుర్తొస్తే ఓటు వేయడం లేదు.

ఇది ఇప్పటికే కేసీఆర్‌కు కూడా అర్థం అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నా. మళ్లీ కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే.. అప్పుడు నేను ఆయన గురించి మాట్లాడుతా.  అప్పటివరకు కేసీఆర్ మీద రాజకీయ విమర్శలేవీ చేయను’ అని సీఎం అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. అయినా బుద్ధి రాలేదు.

పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. అప్పటికీ మార్పు రాలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మళ్లీ బుద్ధి చెప్పారు. కేటీఆర్, హరీశ్‌రావు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే రాష్ర్టంలో బీఆర్‌ఎస్ కనిపించకుండా పోవడం ఖాయమం’ అని జోస్యం చెప్పా రు. రాబోయే రోజుల్లో అభివృద్ధిలో భాగస్వామ్యంకావాలి.. ప్రభుత్వానికి సహకరిం చాలని విపక్షాలకు సూచించారు.