15-11-2025 01:54:13 AM
-ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లోనే ఉంటాం
-కేసీఆర్‌ను సీఎం చేసే దాకా పోరాడుతాం
-జూబ్లీహిల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించింది
-స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా కొట్లాడుతాం
-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీనే అని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ఫలితంతో నిరాశ చెందబోమని, ప్రధాన ప్రతిపక్షంగా తమ పనిని చేసుకుంటూ పోతామని వివరించారు.
ప్రజలతోనే, ప్రజల కోసమే, ప్రజల్లోనే ఉంటామని వెల్లడించారు. కేసీఆర్‌ను మళ్లీ తెలంగాణకు సీఎంను చేసే దాకా పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తమ అభ్యర్థికి రాజకీయ అనుభవం లేకపోయినా, చాలా కష్టపడి ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేశారని అభినందించారు. ప్రతి ఎన్నికలో గెలవాలని పోటీ చేస్తామని తెలిపారు.
గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో, ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా పోరాడిందని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వే ఏజెన్సీలు చెప్పాయని, కానీ ఎన్నికలు ఎలా జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొత్త ఉత్సాహాన్ని, కొత్త బలాన్ని ఇచ్చిందని, ఈ అంశాన్ని సానుకూలంగా పార్టీ పరిగణిస్తున్నదని వివరించారు.
2014 నుంచి 2023 వరకు 7 ఉప ఎన్నికలు జరిగినా అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్కటీ గెలవలేదని గుర్తుచేశారు. గ్రేటర్ హై దరాబాద్ ఎన్నికల్లో కూడా ఒకటి, రెండు సీట్లకే పరిమితమైందని తెలిపారు. ఒక్క ఉప ఎన్నికలో గెలవకపోయినా, డిపాజిట్లు కో ల్పోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వ వైఫ ల్యా లను, ఆరు గ్యారెంటీల అమలును, ప్ర భు త్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయాయని పేర్కొన్నారు.
కులం, మతం పేరుతో రాజకీయం చేయలేదని, ప్ర జలకు అవసరమైన అంశాలను మాత్రమే ప్రచారంలో చర్చకు పెట్టామని వెల్లడించా రు. హైడ్రా నుంచి మొదలు ఆటో అన్నల సమస్యల వరకు అనేక అంశాలను ప్రచారం సందర్భంగా ప్రజలకు తెలియజేసేలా చేశామని పేర్కొన్నారు. గ్యారెంటీల అమలుపై సీ ఎం, రాష్ర్ట ప్రభుత్వం సమీక్ష చేసే స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. మైనార్టీలకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్‌ఎస్ గళమెత్తితే ప్రభుత్వం వారికి స్థానం కల్పించిందని గుర్తుచేశారు.
ఈ ఎన్నిక ఏ విధంగా జరిగిందో ప్రజల్లో, మీడియాలో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని, ఎన్ని రకాలుగా అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో నెల రోజుల ముందు చెప్పామని గు ర్తుచేశారు. స్వయంగా అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండటం, దొంగ ఓటరు కార్డు ల పంపిణీ, షెడ్యూల్ మొదలు పోలింగ్ రో జు వరకు జరిగిన అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేశామని చెప్పారు. ఏదేమైనా ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని, ఈ ఎన్నిక ఫలితంపై కూడా ఆత్మ విమర్శ చేసుకుంటామని తెలిపారు.
ఈ ఎన్నికలో మరింత ఓటింగ్ జరిగి ఉండాల్సిందని, తమకు ఈ ఎన్నికలో మంచి ఓటింగ్ వచ్చిందని చెప్పారు. అయితే జూబ్లీహిల్స్‌లో బీజే పీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నదని, ఆర్‌ఎస్ బ్రదర్స్ సమీకరణం బాగానే వర్కౌట్ అయినట్టు కనిపించిందని తెలిపారు. లగచర్ల మొదలు గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక అరాచకాలను, అక్రమాలను, అవినీతిని ఎండగ డుతూనే ఉన్నామని, ఇదే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పనిచేసుకొని ముందుకు వెళ్తామని వెల్లడించారు. ఈ ఎన్నికతో నిరాశ చెందాల్సిన అవసరం లేదని, జాతీయ కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో ఉనికి కోల్పోయే పరిస్థితిలో ప్రజలు తీర్పునిచ్చారని ఎద్దేవాచేశారు.
ఎన్నిక తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో నిమగ్నమై ముందుకు పోదామని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన మాదిరి ఇక్కడ కూడా పార్టీ మారిన నేతలను డిస్క్వాలిఫై చేసి ఉప ఎన్నికలు వస్తాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకే ఇన్ని అపసోపాలు పడిన కాంగ్రెస్ పార్టీ, 10 ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడతామని స్పష్టంచేశారు.
ఈ ఎన్నిక సందర్భంగా తమ పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు తండ్రి మరణం తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఇంటి నుంచి ఎన్నికల కోసం పనిచేశారని, తమ పార్టీ ఎమ్మెల్సీ రవీందర్‌రావు సోదరుడు చనిపోయిన తర్వాత కూడా ఒక్క రోజులోనే పార్టీ ప్రచారంలో పాల్గొన్నారని ప్రశంసించారు. దీపావళి లాంటి పండుగను సైతం పక్కనపెట్టి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క నేతకు, కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.