07-09-2025 01:08:10 AM
-సనత్‌నగర్ నెహ్రూ పార్క్ దుర్వినియోగం!
-మద్యంప్రియులకు అడ్డగా మారిన వైనం
-భయాందోళనకు గురవుతున్న మహిళలు
సనత్‌నగర్, సెప్టెంబర్ 6 (విజ యక్రాంతి): సనత్‌నగర్ నెహ్రూ పా ర్క్ ప్రజలందరికీ చెందిన ఒక విలు వైన ప్రజా ఆస్తి. చిన్నారులు ఆటలా డుకోవడానికి, పెద్దలు ప్రశాంతంగా నడవడానికి, కుటుంబాలు సేదతీ రడానికి జీహెచ్‌ఎంసీ అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి దీనిని నిర్మిం చింది. అయితే, ఇటీవల కాలంలో ఈ పార్క్ తన అసలు ఉద్దేశాన్ని కోల్పోయి, ప్రైవేటు విందులకు, మద్యం ప్రియులకు వేదికగా మారు తోందని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేద న వ్యక్తం చేస్తున్నారు.
నెహ్రూ పార్కు లో నిత్యం ప్రైవేటు విందులు, మ ద్యం సేవించడం, అధిక శబ్దాలతో కూడిన పార్టీల నిర్వహణ ఎక్కువై పోయింది. సాయంత్రం వేళల్లో నడక కోసం, ఆరోగ్యం కోసం పెద లు, పిల్లలతో కలిసి తల్లిదండ్రులు పార్కుకు వస్తుంటారు. కానీ ఈ గందరగోళం, శబ్ద కాలుష్యం, మ ద్యం విందుల వాతావరణం వల్ల పార్క్‌లో ప్రశాంతత పూర్తిగా కరు వైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్కులను ప్రైవేటు విందుల వేదికలుగా, మద్యం సేవిం చే ప్రదేశాలుగా మార్చడం ఎంత మాత్రం సహించరానిదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజల హక్కులను కాలరాసే చర్య మాత్రమే కాకుండా, పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల హక్కులకు అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో ఉంచాలి అని స్థానికులు స్పష్టంగా డిమాండ్ చేస్తు న్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.