‘ప్రైవేటు’కు న్యాయ సమీక్ష ఉండదు
సింగరేణి టెండర్లపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): టెండర్ బిడ్ల ఆమో దంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినప్పుడే టెండర్‌దారుకు హక్కులు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. గడువు దాటిన తరువాత సమర్పించిన టెండర్లను ఆమోదించాలని పవర్ జనరేషన్ కార్పొరేషన్‌కు ఆదేశాలివ్వలేమని ప్రకటించింది. బొగ్గు సరఫ రాకు చెందిన టెండర్లలో సాంకేతిక కారణాల వల్ల బిడ్‌ను సమర్పించలేకపోయానని, ఒక్క రోజు గడువు పొడిగించకపోవడాన్ని భౌతికంగా సమర్పించిన బిడ్‌ను ఆమోదించకపోవడాన్ని సవాలు చేస్తూ కొత్త గూడేనికి చెందిన సీహెచ్ కిశోర్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సింగరేణి కాలరీస్‌కు చెందిన మణుగూరు బొగ్గు గనుల నుంచి బీటీపీఎస్ కోల్ యార్డుకు ఏడాదిపాటు రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణాకు పవర్ జనరేషన్ కార్పొరేషన్, జెన్‌కో టెండరు నోటిఫికేషన్ జారీ చేయగా, మార్చి 4న బ్యాంకు గ్యారెంటీ సమర్పించినట్లు తెలిపారు. మార్చి 5న సాంకేతిక కారణాల వల్ల బిడ్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించలేకపోయామని, ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఒక్క రోజు గడువు పొడి గించాలని, అదేవిధంగా భౌతికంగా సమర్పించిన బిడ్‌ను స్వీకరించాలని కోరితే తిరస్కరించారని చెప్పారు.
ప్రతివాదుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ తప్పు కారణంగా గడువు పెంచమనడం సరికాదని, గతంలో ఇలాంటి కారణంగా ఒక్కసారి కూడా టెండర్ ప్రక్రియను వాయిదా వేయలేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి అధికారులు బిడ్‌ను పక్ష పాతంగా, ఏకపక్షంగా తిరస్కరిస్తేనే పిటిషనర్‌కు హక్కులుం టాయని అన్నారు. టెండర్లు, కాంట్రాక్ట్ వ్యవహారాల్లో ప్రైవేటు ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం న్యాయసమీక్ష అధికారాన్ని వినియోగించలేమని తేల్చి చెప్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.






