calender_icon.png 16 January, 2026 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వాయిదా

16-01-2026 02:16:51 PM

న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది.తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ మార్చికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు(Supreme Court) ప్రకటించింది. తదుపది విచారణ వరకు మధ్యంతర ఉపశమనం ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ నాగరత్న ధర్మాసనం(Justice Nagaratna's bench) ఉత్తర్వులు ఇచ్చింది. ముందస్తు బెయిల్ ఖరారు చేయవద్దని ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని లాయర్ సిద్ధార్థలూథ్రా ధర్మాసనాన్ని కోరారు. ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకుని విచారణను కోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు 14 రోజుల సిట్ విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు బీఆర్ఎస్ నాయకులను సిట్ విచారించింది.