27 April, 2026 | 10:46 AM

ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం

27-04-2026 09:12 AM

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) మాసాయిపేట 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ట్రావెల్ బస్సు(Private Travel Bus Catches Fire) పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన బస్సు రిపేర్ నిమిత్తం మెదక్ కు తీసుకువచ్చారు. మరమ్మతులు పూర్తి కాగానే తిరుగు ప్రయాణంలో, మాసాయిపేట శివారులోని బంగారమ్మ గుడి వద్ద బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రెవర్, క్లీనర్ త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని, ఫైర్ ఇంజన్ ను రప్పించి మంటలను అర్పించడం జరిగింది.