16 July, 2026 | 9:58 AM

అండగా ఉంటాం: పుష్ప మేకర్స్

06-12-2024 12:00 AM

‘పుష్ప2: ది రూల్’ బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో హీరో అల్లు అర్జున్ వచ్చారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. తాజాగా ఈ ఘటనపై అల్లు అర్జున్ టీమ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘నిన్న (బుధవారం) రాత్రి సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా టీమ్ ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం’ అని తెలిపింది.

తాజాగా గురువారం చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ఘటనపై స్పందించింది. ‘నిన్న (బుధవారం) రాత్రి స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాం. ఆ కుటుంబం, చికిత్స పొందుతున్న కుర్రాడి గురించే మేము ప్రార్థిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవడానికి, సాధ్యమైనంత వరకు అన్నివిధాలా సహాయాన్ని అందిస్తాం’ అని పేర్కొంది.