15 April, 2026 | 8:49 AM

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల అందజేత

12-01-2026 12:00 AM

కుషాయిగూడ, జనవరి 11 (విజయక్రాంతి) : సంక్రాతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కుషాయిగూడ శుభోదయ కాలనీ పేస్ 1, పేస్ 2 కాలనీలలో అసోసియేషన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పనగట్ల చక్రపాణి గౌడ్ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో వందల మంది మహిళలు పాల్గొని వారి కళా నైపుణ్యాన్ని ముగ్గుల రూపంలో ప్రదర్శించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు పనగట్ల చక్రపాణి గౌడ్ సతీమణి ప్రసన్న గౌడ్ చేతుల మీదుగా బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో శుభోదయ కాలనీ పేస్ 1 పెద్దలు చెంచు రెడ్డి, అధ్యక్షులు మల్లేష్, రవి చారి, శుభోదయ కాలనీ పేస్ 3 పెద్దలు కాసుల నందం గౌడ్, కాలనీ అధ్యక్షులు తిగుళ్ళ రాంచందర్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సిద్ద రాములు, భాను, ప్రధానకార్యదర్శి మల్లేష్, కమిటీ సభ్యులు బాలరాజు గౌడ్, కృష్ణ, రమేష్ బాబు, ప్రసాద్ కృష్ణ, రమేష్, శ్రీకాంత్ గౌడ్ , మహిళా సభ్యులు శోభా రాణి, రమా దేవి, మాజీ అధ్యక్షుడు వీర నారాయణ రెడ్డి, లక్ష్మి నారాయణ గౌడ్, శెట్టి రాఘవేందర్, పల్లె కృష్ణ రెడ్డి మరియు షాలిని మాధవి, బన్నాపురం నాగరాజు, నీరుడు బాబు రాంగిరివార్ నర్సింగ్ రావు మరియు కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

ఈసీ నగర్లో : చర్లపల్లి డివిజన్లోని ఈసీ నగర్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలను, చిన్నారులను అభినందిస్తూ, భారతీయ సంప్రదాయాల పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఈసీ నగర్ కాలనీవాసులు సత్తిరెడ్డిస్థానిక నాయకులు, మహిళాలు , మరియు కాలనీ వాసులు పాల్గొని సంక్రాంతి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.