calender_icon.png 12 January, 2026 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం సంక్రాంతి

12-01-2026 12:00:00 AM

రాష్ట్ర వ్యవసాయ రైతు వెల్ఫేర్ కమిషన్ సభ్యురాలు మడకంటి భవానీ రెడ్డి

కుషాయిగూడ, జనవరి 11 (విజయక్రాంతి) సంక్రాంతి పండుగ అంటే తెలుగు ప్రజల సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని సంక్రాంతి పండుగ రాగానే గుర్తుకు వచ్చేది ఇంటి ముంగట వేసిన రంగు రంగుల ముగ్గులు అవి రమణీయమైన ముగ్గులు అని తెలంగాణ వ్యవసాయ రైతు కమిషన్ సభ్యురాలు మడకంటి భవాని రెడ్డి అన్నారు ఆదివారం ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డలో ముగ్గుల పోటీలకు భవానీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ముగ్గులు అలంకారం మాత్రమే కాదు వాటి వెనుక లోతైన సంప్రదాయ శాస్త్రీయ సామాజిక అర్ధాలు ఉన్నాయని సంక్రాంతి ముగ్గుల ప్రత్యేకతలను ఆమె చెప్పుకొచ్చారు.

అనంతరం ముగ్గుల పోటీలో విజేతలైన మహిళా నారీమణులకు బహుమతులను మడకంటి భవాని రెడ్డి పాకాల రాజన్న కొత్త అంజిరెడ్డి రాఘవరెడ్డి పత్తి కుమార్ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పావని మణిపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాకాల రాజన్న, డివిజన్ కాంగ్రెస్ నాయకుడు రాఘవరెడ్డి, కాలనీవాసులు లక్ష్మీనారాయణ సుంకు శ్రీకాంత్ రెడ్డి నర్సింగ్ రావు శ్రీనివాస్ పత్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు.