12-01-2026 12:00:00 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో అడిక్మెట్, భోలక్‌పూర్ డివిజన్ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహ, ముషీరాబాద్ నియోజకవర్గ డివిజన్ ప్రెసిడెంట్లు, శ్రీనివాస్‌రెడ్డి, వై. శ్రీనివాస్, రాకేష్ కుమార్, శ్రీధర్ రెడ్డి, శంకర్ ముదిరాజ్, కార్యదర్శి ఆకుల అరుణ్ కుమార్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కాడబోయిన బాబురావు, అ శోక్, శంకర్ గౌడ్, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చ కుర్తి ప్రభాకర్, శంకర్ గౌడ్, దీన్ దయాల్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్యాంసుందర్ చిట్టి, ఖదీర్, మాధవ్ మాధవ్, జబ్బర్, ఎర్రం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.