18-07-2025 01:09:10 AM
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
కాప్రా, జులై 17(విజయక్రాంతి) : చర్లపల్లి బీపీసీఎల్ యూనిట్ లో డ్రైవర్లు, హెల్పర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో యూనియన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ డ్రైవర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక రవాణా కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో న్యాయం జరగాలని, కనీ స వేతనం రూ.26,000- నైపుణ్య కా ర్మికులకు రూ.36,000- చెల్లించాలన్నారు.