calender_icon.png 9 November, 2025 | 1:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసేకరణ ప్రక్రియ వేగంగా చేపట్టాలి

19-05-2024 12:05:00 AM

అధికారులతో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య

వరంగల్, మే 18(విజయక్రాంతి): జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలకు కావాల్సిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఇన్నర్ రింగ్ రోడ్, నేషనల్ హైవే, రైల్వే లైను, ఇరిగేషన్ ప్రాజెక్టుల భూ సేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిం చారు.  ప్రాజెక్టుల వారీగా భూ సేకరణ పూర్తి చేసి రైతులకు చెల్లించిన, చెల్లించాల్సిన పరిహారం పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని చెప్పారు.  సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌వో శ్రీనివాస్, ఆర్డీవోలు సిదం దత్తు, కృష్ణవేణి, కుడా పివో అజిత్‌రెడ్డి, టీజీఐఐసి జనరల్ మేనేజర్ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

టీఎస్ తీసేయండి..

టీఎస్ స్థానంలో టీజీ వెంటనే అమలు చేయాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజన్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతోపాటు అధికారిక కమ్యూనికేషన్‌లకు సైతం తెలంగాణ కోడ్‌ను టీఎస్‌కు బదులుగా టీజీ వాడాలని సూచించారు.