5 May, 2026 | 3:27 AM

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు

05-05-2026 02:03 AM

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 

సుల్తానాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోనే ఏక్కడ లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఏలాంటి కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తూ, రైతులకు మీ విజ్జన్న భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్,పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక- రైతు వారం కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం,కనుకుల గ్రామంలో సోమవారం జరిగిన రైతు వేదిక స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎప్పటికీ ఒక్కటే పంట వేయడం కాకుండా లాభదాయకమైన పంటల పట్ల ఆసక్తికనబరచాలన్నారు. ఆయిల్ ఫామ్, పప్పు దినుసులు, వాణిజ్య పంటల పట్ల దృష్టి సారించా లన్నారు. రైతు సమస్యల పరిష్కారం పట్ల, వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే ప్రజలంతా సంతోషంగా ఉంటారని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు , పలు గ్రామాల ప్రజాప్రతిని ధులు,రైతులు పాల్గొన్నారు...