06-05-2025 11:50:02 AM
కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కల్వకుర్తి పట్టణంలోని పంజుగుల రోడ్డు సమీపంలో ఉన్న కేఎల్ఐ కాల్వలో అనుమానాస్పద స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలు మార్చాల గ్రామానికి చెందిన ప్రభావతి(40)గా గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాలువలో నుండి బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.