06-05-2025 12:02:14 PM
వీరబాబు నియామకం పట్ల యువతరం హర్షం..
వైరా,(విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా నియోజకవర్గ కేంద్రమైన వైరా పట్టనానికి చెందిన తోటకూర వీరబాబు(Thotakura Veerababu)ను వైరా మండల యాదవ సంఘం యూత్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు సంబంధిత నియామక పత్రాన్ని యాదవ సంఘం సీనియర్ నాయకులు కూరాకుల నాగభూషణం చేతుల మీదుగా మంగళవారం అందుకున్నారు.
మృదు స్వభావిగా, పెద్దలపట్ల వినయ విధేయలతో వుంటూ.. పలు సామాజిక సేవా అంశాల్లో ముందుంటూ అన్ని వర్గాల ప్రజల మన్ననల్ని పొందుతున్న వీరబాబుకు యాదవ సంఘం వైరా మండల యూత్ అధ్యక్షుడిగా పదవి రావడం పట్ల యువతరంలో హర్షం వ్యక్తం అవుతుంది. 2014 సంవత్సరం నుండి రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుతూ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ లో క్రియాశీలక భూమిక పోషిస్తున్న వీరబాబు రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. ఇంతటి బాధ్యత గల పదవి ఎంపికకు కృషిచేసిన కూరాకుల నాగభూషణంకు యాదవ కుల పెద్దలకు వీరబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంకితభావంతో పనిచేస్తూ యువకుల అభ్యున్నతికీ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.