calender_icon.png 6 May, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదు: ఎంపీ ఈటల

06-05-2025 12:30:58 PM

తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రమని సీఎం అనడం సరికాదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఎన్నడూ పేద రాష్ట్రం కాదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etala Rajender) మంగళవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. నాయకులు వెనుకబడేసిన ప్రాంతం తెలంగాణ అని ఈటల రాజేందర్ ఆరోపించారు. స్వాతంత్య్రానికి పూర్వమే రైల్వే, విద్యుత్, టెలిఫోన్ సౌకర్యాలు ఉన్న ప్రాంతం అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో ఉన్నన్ని చెరువులు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని వివరించారు. ఒక వ్యక్తిని, ఒక పార్టీని దోషిగా నిలబెట్టేందుకు తెలంగాణను దివాలా రాష్ట్రంగా చూపొద్దని ఈటల హెచ్చరించారు. తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనటం సరికాదని హితువు పలికారు. ధాన్యం దిగుబడి, జీఎస్డీపీ, వృద్ధిరేటు, అత్యధిక బడ్జెట్ స్థాయి వంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రం(Telangana State) అగ్రస్థానంలో ఉందని ఆయన వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాటల వల్ల తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. కొత్త రాష్ట్రమే అయినా.. తడబాటు లేకుండా గొప్పగా పురోగమిస్తున్నామని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. 2014లోనే తెలంగాణ సొంత పన్నుల ఆదాయం రూ. 29 వేల కోట్లు ఉందని, ఏటా రూ. 5 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. 2023-24లో రూ. 1.19 లక్షల కోట్ల ఆదాయం తెలంగాణకు వచ్చిందని రాజేందర్(Eatala Rajendar) పేర్కొన్నారు. 2024-25లో రూ. 1.25 లక్షల కోట్ల ఆదాయం తెలంగాణకు వస్తుందని లెక్కచెప్పారు. పన్నేతర ఆదాయం కూడా 2014లోనే రూ. 6 వేల కోట్లు ఉందన్నారు. 2023-24లో రూ. 20 వేల కోట్ల పన్నేతర ఆదాయం వచ్చింది స్పష్టం చేశారు.  కేంద్రం పంపిణీ చేసే పన్నుల ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోందని తెలిపారు.