calender_icon.png 19 July, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమి ఆక్రమించిన వ్యక్తిపై ఫిర్యాదు

19-07-2025 12:00:00 AM

పటాన్ చెరు/జిన్నారం, జులై 18 : బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వ్యక్తిపై జిన్నారం తహసీల్దార్ దేవదాసు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళ్తే...బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనంబర్ 242లో 6 గుంటలు, సర్వేనంబర్ 243లో 29 గుంటల స్థలం ఆక్రమణకు గురైంది.  బొల్లారానికి చెందిన జితేందర్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలంలో మట్టి నింపి ఆక్రమించినట్లుగా ఆర్‌ఐ జయప్రకాశ్ నారాయణ తెలిపారు. 

తహసీల్దార్ ఆదేశాల మేరకు  స్థలాన్ని శుక్రవారం ఆయన  పరిశీలించారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించిన జితేందర్ అనే వ్యక్తిపై బొల్లారం పోలీస్ స్టేషన్ లో తహసీల్దార్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలంలో మట్టి నింపి ఆక్రమించిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.