8 June, 2026 | 6:12 PM

Breaking News

నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి   •  

ఉద్యోగుల బదిలీలపై నిషేధం

01-08-2024 01:23 AM

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, జులై 31(విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధాన్ని విధిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 5 2024 నుంచి 31 జూలై 2024 వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గడువు పూర్తి కావడంతో బదిలీలపై ఆగస్టు 1 నుంచి నిషేధాన్ని పునరుద్ధరించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ప్రమోషన్లు పొందినవారికి, విదేశీ సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి ఈ ఉత్తర్వుల్లో మినహాయింపు ఇచ్చింది. శాఖలవారీగా ఆరు నెలల్లో నిషేధంపై సడలింపు కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పింది. అడ్మినిస్ట్రేటివ్ కోసం భర్తీచేయాల్సిన ప్రస్తుత ఖాళీలను ఏడాది సర్వీస్‌ను పూర్తిచేసిన వారితో నింపనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.