ఆన్‌లైన్‌లోనే ఆస్తిపన్ను చెల్లింపులు
08-06-2024 01:45 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు నగదు రూపంలో చెల్లించే ప్రాపర్టీ టాక్స్ విధానానికి జీహెచ్‌ఎంసీ స్వస్తి పలుకుతుంది. ఈ మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రాపర్టీ టాక్స్ చెల్లించే వారంతా డిజిటల్ రూపంలోనే చెల్లించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులు సిటిజన్ సర్వీస్ సెంటర్లు లేదా మీ సేవా కేంద్రాలలో జూన్ 10 నుంచి ఆన్‌లైన్‌లోనే చెల్లించేందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.






