15 July, 2026 | 2:41 PM

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత

08-06-2024 01:44 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి) : రైలులో తరలిస్తు న్న గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెం ట్ అధికారులు శుక్రవారం ఖమ్మం రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కోణా ర్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి తరలుతున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. ఖమ్మం రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపి తనిఖీలు చేపట్టగా రెండు సంచుల్లో గంజాయి లభించింది. 23 కిలోల వరకు ఉం టుందని, రూ.10లక్షలు విలువ చేస్తుందని అంచనా వేశారు. గురువారం కూడా ఇదే రైలులో పది కిలోల గంజాయి దొరకడం గమనార్హం. 

రూ.3 లక్షల బెల్లం పట్టివేత

హైదరాబాద్‌లోని గంజ్ మార్కెట్ నుంచి ఓ కారులో తరలిస్తున్న 3.60 క్వింటాళ్ల బెల్లాన్ని, 40కిలోల ఆలం, నాలుగు లీటర్ల నాటు సారాను స్వాధీ నం చేసుకున్నట్లు కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ జె.వెంకట్‌రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూ ల్ జిల్లా కల్వకుర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుమిత క్రాస్ రోడ్డు వద్ద ఎక్సైజ్ పోలీ సులు తనిఖీలు నిర్వహించారు.  కారులో తరలిస్తున్న బెల్లాన్ని పట్టుకున్నారు. కొత్తపల్లి తండాకు చెందిన కాట్రావత్ రవి, వెంకటాపూర్ తండా కు చెందిన జగన్ నాయక్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ దాడుల్లో సిబ్బంది మహేష్, నార్య, రఘు, బిక్షపతి తదితరులున్నారు.