4 June, 2026 | 6:29 PM

పర్యావరణాన్ని కాపాడుకుందాం

04-06-2026 05:34 PM

అడిషనల్ కలెక్టర్ బి వెంకటేశ్వర్లు

ఖానాపూర్ (విజయక్రాంతి): మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనుగడ ఉంటుందని, నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ బి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఖానాపూర్ మండలంలోని అడవి సారంగాపూర్ గ్రామంలో స్వచ్ఛ ఘౌ స్వచ్ఛ జల వాయు ,అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అడవి సారంగాపూర్ అనుబంధ గ్రామాలను సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఇంకుడు గుంతలు, నర్సరీల పర్యవేక్షించారు .కార్యక్రమంలో డి ఎల్ పి ఓ లింగయ్య, ఎంపీడీవో రాధా రాథోడ్ ,ఎంపీఓ సిహెచ్ రత్నాకర్ రావు, గ్రామ సర్పంచులు పలువురు పాల్గొన్నారు.