24 July, 2026 | 10:50 AM

తూప్రాన్ లో బిజెపి పార్టీకి నిరసన సెగ

24-07-2026 09:38 AM

విద్యార్థుల పట్ల అవలంబిస్తున్న తీరును మార్చుకోకపోతే తీవ్ర పరిణామం

నీట్ పేపర్ లీక్ కావడంతో విద్యార్థులకు తీరని నష్టం

తూప్రాన్, జూలై 23. (విజయ క్రాంతి): తూప్రాన్ పాత మున్సిపల్ కార్యాలయం వద్ద రాష్ట్ర నాయకులు చిటుకుల మహిపాల్ రెడ్డి నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి పిలుపుమేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో బిజెపి విద్యార్థుల పట్ల అవలంబిస్తున్న తీరును మార్చుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఆహర్నిశలు శ్రమించి విద్యార్థులను గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దలన్న సంకల్పంతో లక్షల డబ్బులు వెచ్చించి పై చదువులు చదివిస్తున్నారని అన్నారు. విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం లీక్ చేయడంతో విద్యార్థులంత శోకసాంద్రంలో మునిగిపోయారని ఇంతకాలం కలలుగన్న వారి ఆశలు అడియాశలు చేసిన ప్రభుత్వం బిజెపి ప్రభుత్వమేనని దీనికి సమాధానం చెప్పాల్సినది బిజెపి పార్టీయేనని అన్నారు.

విద్యార్థుల ఉసురు తలిగి వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతారని అన్నారు. విద్యార్థుల ఆత్మ అభిమానాన్ని చంపి వారు కష్టపడి చదివిన చదువులను నీరుగార్చిన ప్రభుత్వం బిజెపి ప్రభుత్వమేనని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. వారికి జరిగిన అన్యాయంపై అహర్నిశలు పోరాడుతామని రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి అన్నారు. ఇందులో తూప్రాన్ మండల మాజీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు గరిగె నర్సింగరావు, నాగులపల్లి శ్రీనివాస్ రెడ్డి, తాడూరి కృష్ణారెడ్డి, అబ్బురి బాలేష్, కొండాపూర్ సర్పంచ్ రాము, దండుపల్లి సర్పంచ్ మరాటి నాగరాజు, జావిద్ పాషా, గడ్డి వెంకటేష్, అజార్, ఉమర్, అప్సర్, ముత్యాల గౌడ్, తాడేపు మహేందర్, తిరుపతి యాదవ్, తిరుపతి రెడ్డి, శ్రీరాములు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.