23 July, 2026 | 1:51 AM

రాహుల్ అరెస్టుకు నిరసనగా ఆందోళన

23-07-2026 12:00 AM

వనపర్తి టౌన్, జూలై 22: రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీచౌక్లో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాజకీయ కక్షసాధింపుతో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.