10 May, 2026 | 11:44 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ నిరసన

05-02-2025 05:32 PM

నిర్మల్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక బడ్జెట్ను నిరసిస్తూ బుధవారం నిర్మల్ లో వ్యవసాయ కార్మికుల సంఘం కిషన్ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బడ్జెట్ కాపీలను ప్రదర్శించారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దేశంలో ఆహార ఉత్పత్తులు తగ్గిపోయి వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం రైతులపై ఉన్న ప్రేమను బడ్జెట్ రూపంలో ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రాజన్న నూతన కుమార్ తిరుపతి రామ్ లక్ష్మణ్ ఎస్ ఎన్ రెడ్డి రాజు గంగన్న గఫూర్ తదితరులు ఉన్నారు.