ఉద్యోగాల కల్పనలో కేంద్రం విఫలం
05-02-2025 05:38 PM
డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టికానంద్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీకానంద్, కార్తీక్ అన్నారు. బుధవారం దహేగాం మండల కేంద్రంలో డివైఎఫ్ఐ క్యాలెండర్ ను జిల్లా కమిటీ సభ్యురాలు కుందారపు మంజులతో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్య వైద్యం ఉపాధి ఉద్యోగం కొరకు నిరంతరం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు ప్రకటించడం బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. జిల్లాలో కనీసం పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్, లత, పూజ, మధుప్రియ, నాగరాజు తదితరులు ఉన్నారు.






