30 May, 2026 | 1:27 AM

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ ధర్నా

30-05-2026 12:53 AM

ములకలపల్లి, మే 29 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు,డీజిల్,నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండల కమిటీ ఆధ్వర్యంలో ములకలపల్లి మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.

ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్,సంయుక్త మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ మాట్లాడుతూ.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల నుండి పేద ప్రజల మీద మధ్యతరగతి ప్రజల మీద పెట్రోలు,డీజీలు,గ్యాస్, నిత్యావసరాలు,రైల్వే చార్జీలు,విమానా చార్జీలు,ఆరోగ్యానికి సంబంధించిన మందులు,కిరాణా,వ్యవసాయ పంటలకు సంబంధించిన ఫెర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ వంటి ధరలు పెంచి పేద,మధ్యతరగతి వర్గాల ప్రజల మీద భారాలు మోపటం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పరిపాలనకు నిదర్శనమని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకలు బండారు నాగేంద్రబాబు,ఎర్రగొర్ల రామారావు, ఓరుగంటి శ్రీను,ఊకే వెంకటేష్, సవల్ల శివ,బండారు రామారావు తదితరులు పాల్గొన్నారు.