calender_icon.png 21 January, 2026 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే సార్.. డంపింగ్ యార్డ్ మాకొద్దు

21-01-2026 12:01:23 AM

తుంగతుర్తి, జనవరి 20: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో గడిచిన 50 సంవత్సరాల క్రితం నుండి పేద దళితులు జాతీయ రహదారి పక్కన గల సర్వేనెంబర్ 10 ,11 లో గల భూమిని నిరుపేదలైన దళితులు కొంతమంది వ్యవసాయం చేస్తూ మరి కొంతమంది గోర్లు, మేకలు, బర్లను మేపుతూ జీవనోపాధి సాగిస్తున్నారు. గ్రామంలో కొంతమంది ఓర్వక, అధికారులతో కుమ్మక్కై భూములలో నూతనంగా డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు చేపట్టారు.

కావున మాయందు దయవుంచి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, పేద దళితుల విజ్ఞప్తి మేరకు చెత్త డంపింగ్ యార్డుతో  గ్రామస్తులకు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కావున డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. లేనియెడల అధికారుల తీరుపై మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మట్టిపల్లి శ్రీశైలం యాదవ్, వార్డు సభ్యులు కాసర్ల ఉప్పలయ్య కంచం సందీప్, వగలగాని రాము, మట్టిపల్లి ప్రవీణ్ కుమార్, గ్రామస్తులు మల్లెపాక శ్రీను, మల్లపాక చంటి, కాసర్ల రాకేష్, నకిరేకంటి నాగేశ్వరరావు, కామ యాదయ్య, వగలగాని కృష్ణ పాల్గొన్నారు.