18 May, 2026 | 3:03 PM

నిరసన నేరం కాదు

20-06-2024 12:50 AM

టీవీవీ సభ్యులపై కేసు డిస్మిస్ 

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): బహిరంగ ప్రదేశాల్లో శాంతియుతంగా నిరసన తెలపడం నేరమేమీ కాదని హైకోర్టు చెప్పింది. తెలంగాణ విద్యార్థి వేదిక సభ్యులపై పెట్టిన కేసును కొట్టివేసింది. 2010 మే 17 పౌరహక్కుల సంఘాలకు చెందిన ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావును విడుదల చేయాలంటూ అంబేద్కర్ విగ్రహం వద్ద అనుమతిలేకుండా నిరసన వ్యక్తం చేసిన వారిలో 13 మందిపై సైఫాబాద్ పోలీసులు కేసు పెట్టారు. దీనిని కొట్టేయాలంటూ టీవీవీ సభ్యులు కొత్తపల్లి మహేశ్, తంగెళ్ల సూర్య, సాహితి, కొత్తపల్లి అనిల్, బంటు సాగర్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు.. పిటిషనర్లు శాంతి భద్రతలకు భంగం కలిగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ప్రజాజీవనానికి ఇబ్బందిలేకుండా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేశారు.