calender_icon.png 13 November, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన

13-11-2025 12:00:00 AM

అశ్వాపురం, నవంబర్ 12 (విజయక్రాంతి): దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గిరిజ న సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం అశ్వాపురం మండలంలోని గొందిగూడెం ఆశ్రమ పాఠశాలలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల టిపిటిఎఫ్ అధ్యక్షుడు క్రాంతి కిరణ్, మండల ప్రధాన కార్య దర్శి పి. కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పాల్గొని మాట్లాడుతూ గిరిజన సంక్షే మ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్, బదిలీలు, ప్రమోషన్లు, ఆఫ్గ్రేడేషన్, పీఎఫ్ అకౌంట్లు కేటాయింపు వంటి సమస్యలు చాలా కాలంగా పరిష్కారం కాని స్థితిలో ఉ న్నాయి.

ప్రభుత్వం తక్షణమే ఈ అంశాలపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అలాగే, ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 24న ఐటీడీఏ కార్యాలయం, వచ్చే నెల 12న కమిషనర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హె చ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టిపిటిఎఫ్ సభ్యులు, ఆశ్రమ పాఠశాల ప్రధా నోపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులుపాల్గొన్నారు.