12-10-2025 03:54:11 PM
దేవరకొండ,(విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం గుడిపల్లి మండలం గణపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తోటకూరి పరమేష్, కటికనేని మాధవ రావు, కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, కస్తూరి యాదగిరి, అదంకి దానబాబు, మైనం లింగయ్య, నాయిని రాఘవేంద్ర రావు,తోపాటు 150కుటుంబాలు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన నాయకులకు గులాబీ కండువాలను కప్పి మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలి ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెల్లుగూరి వల్లపు రెడ్డి, మునగాల అంజి రెడ్డి,అర్వపల్లి నర్సింహ, నిమ్మల విష్ణువర్ధన్ రెడ్డి,మద సుధాకర్ గౌడ్,బొడ్డుపల్లి మహేందర్ తదితరులు అన్నారు.