23-12-2025 12:37:35 PM
న్యూఢిల్లీ: ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషనర్ కార్యాలయం(Bangladesh High Commission office) మంగళవారం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని మూకదాడి చేసి చంపిన ఘటనకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్(Vishwa Hindu Parishad), ఇతర హిందూ సంస్థల సభ్యులు భారీ నిరసన చేపట్టారు. వీహెచ్ పీ(VHP activists) కార్యకర్తలు హైకమిషనర్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. వీహెచ్ పీ శ్రేణలులు బారీకేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీహెచ్ పీ ఆందోళనల దృష్ట్యా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. పోలీసులు వీహెచ్ పీ కార్యకర్తలను నిలువరిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం బంగ్లాదేశ్ మిషన్ల భద్రతపై భారత రాయబారిని పిలిపించింది. న్యూఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని రెండు బంగ్లాదేశ్ మిషన్ల వెలుపల నిరసనకారుల బృందాలు ఇటీవల ప్రదర్శనలు నిర్వహించిన తర్వాత ఈ చర్య వచ్చింది. గత వారం భారత్-బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లాను పిలిపించి, పొరుగు దేశంలో క్షీణిస్తున్న భద్రతా వాతావరణం మరియు ఢాకాలోని భారత మిషన్ భద్రతను ప్రభావితం చేసే ఉగ్రవాద శక్తుల ప్రణాళికలపై నిరసన వ్యక్తం చేసిన తర్వాత సంబంధాలు మరింత దిగజారాయి.