calender_icon.png 23 December, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ క్రైమ్ పై విస్తృత ప్రచారం

23-12-2025 01:46:38 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): డిజిటల్, సోషల్ మీడియాల ద్వారా తక్కువ పెట్టుబడులకు అధిక దిగుబడులంటూ వివిధ రకాల రుణాల అవకాశాలు కల్పిస్తామంటూ ప్రచారం అవుతున్న ప్రకటనలను నమ్మొద్దు అంటూ సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు సైబర్ క్రైమ్ ఫై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రధాన కూడలిల వద్ద వాల్ పోస్టర్స్ అతికిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. లోన్ యాప్ రుణాలు తీపిగా అనిపించిన అందులో చేదు నిజం దాగి ఉంటుందని గమనించాలని గుర్తు చేస్తూ పోలీస్ సిబ్బంది వివరిస్తున్నారు.