calender_icon.png 23 December, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ లో ఘనంగా క్రైస్తవ ఐక్యవేదిక క్రిస్మస్ వేడుకలు

23-12-2025 01:48:38 PM

క్రైస్తవులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దొనికేని దయానంద్

ఖానాపూర్,(విజయక్రాంతి): క్రిస్మస్ పర్వదినమును పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రైస్తవ ఐక్యవేదిక క్రిస్మస్ వేడుకలను నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో సోమవారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. ఈ సమావేశంలో ఖానాపూర్, కడం, పెంబి, దస్తురాబాద్, మండలాల నుంచి వందలాదిగా క్రైస్తవ విశ్వాసులు తరలివచ్చారు. కడెం ఖానాపూర్ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కనుల విందుగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు ,తాసిల్దార్లు దొనికేని దయానంద్, సుజాత రెడ్డి లు క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రైస్తవులను కడుపులో పెట్టుకొని దాచుకుంటామని ఎవరు భయపడవద్దని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని తెలిపారు.

కాగా డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు త్వరలోనే క్రైస్తవులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సమాధుల స్థలాలు సేకరణకు కార్యాచరణ సిద్ధం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ప్రసంగికులు జ్ఞాన ప్రకాష్ ,ప్రముఖ జర్నలిస్ట్ ఏసుదాస్ రెడ్డిమల్ల, చిత్ర మిషన్ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ ఫౌండర్ చైర్మన్ నేత్ర వైద్య సహాయకురాలు చిత్రలత రెడ్డి మల్ల లు నిరుపేద క్రైస్తవులకు చీరలు, బట్టలు అందించగా, పాస్టర్స్ కి ఇస్త్రీ పెట్టెలు కానుకలుగా ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, తాసిల్దార్ సుజాత రెడ్డి, కడం ఖానాపూర్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు పాస్టర్ ప్రశాంత్, రాజబాబు, ఏసుదాస్, నతానియల్, రవి, అహరోను, సంసోను, జాషువా నర్సింగ్ రావు, భాగ్యశేఖర్, నాలుగు మండలాల పాస్టర్లు, విశ్వాసులు, పాల్గొన్నారు.