23-12-2025 02:15:43 PM
మస్కాపూర్ గ్రామ సర్పంచ్ దొనికేని లక్ష్మి దయానంద్
ఖానాపూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ మండలం లో మస్కాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి కృషి చేస్తానని ఆ గ్రామ నూతన సర్పంచ్ ధొనికేని లక్ష్మీ దయానంద్ అన్నారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలో హామీ ఇచ్చిన లో వోల్టేజీ గల ట్రాన్స్ఫార్మర్లను మార్చి నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని దీంతో గ్రామంలో లో వోల్టేజి సమస్య పూర్తిగా తీరిపోతుందని అన్నారు. ఆమెను గ్రామస్తులు పలువురు ఈ సందర్భంగా అభినందించారు.