calender_icon.png 23 December, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేంపల్లి టింబర్ డిపోలో కలప వేలం

23-12-2025 01:40:35 PM

24న వేలం నిర్వహణ

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలంలోని వేంపల్లి టింబర్ డిపోలో ఈ నెల 24వ తేదీ (బుధవారం) ఉదయం 11.00 గంటలకు కలపను వేలం ద్వారా విక్రయించనునట్లు  అటవీ శాఖ అధికారులు తెలిపారు. కలప అమ్మకాన్ని జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఈ వేలం పూర్తి పారదర్శకతతో నిర్వహించబడుతుందని తెలిపారు.అర్హత కలిగిన కలప వ్యాపారులు, వినియోగదారులు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు.అన్ని షరతులు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. కలప రకాలు, పరిమాణం, వేలం విధానం, రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఆసక్తి గల వారు వేంపల్లి టింబర్ డిపో కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.