21 April, 2026 | 3:49 PM

Breaking News

జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •  

శిలాఫలకంపై ప్రోటోకాల్ వివాదం

01-05-2025 11:13 PM

శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన కార్పొరేటర్ లచ్చిరెడ్డి...

ఎల్బీనగర్: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ లో శిలాఫలకంపై ప్రోటోకాల్ రగడ రగులుకున్నది‌. శిలాఫలకలో స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రోటోకాల్ ప్రకారం లేకపోవడంతో శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనేపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ఎన్జీవోస్ కాలనీలో పౌర గ్రంథాలయ ఆవరణలో గురువారం నూతన గ్రంథాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసే శిలాఫలకంలో సరైన విధంగా ప్రోటోకాల్ పాటించలేదంటూ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అభివృద్ధి కార్యక్రమాల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం సమయంలో కార్పొరేటర్ అతడి అనుచరులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ప్రోటోకాల్ అంశంలో అధికారులపై రాజకీయ ఒత్తిడి ఎక్కువ కావడంతోనే మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేరును ప్రోటోకాల్ ప్రకారం పెట్టలేదని శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అధికారుల తీరుపై కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనేపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంథాలయ సిబ్బంది ఫిర్యాదుతో వనస్థలిపురం పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.