02-05-2025 12:00:00 AM
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా ’మే డే’ ఉత్సవాలు
ముషీరాబాద్, మే 1 (విజయక్రాంతి): మోడీ ప్రభుత్వ తిరోగమన విధానాలతో కార్మికుల హక్కులు, రక్షణ, గౌరవాన్ని తిరస్కరించే 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలనీ ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ యూసఫ్ డిమాండ్ చేసారు. కొత్తగా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాల అమలుతో కార్మికుల హక్కులపై కేంద్ర ప్రభుత్వం నిరంతర దాడులు చేస్తోందని ఆరోపించారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే డే’ ఉత్సవాలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిం ది. హైదరాబాద్, హిమాయత్ నగర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం వద్ద గురువారం మొహమ్మద్ యూసఫ్ అరుణపతాకాన్ని ఆవిష్కరించి, కార్మికుల ప్రదర్శనను జండా ఊపి ప్రారంభించారు.
హిమాయత్ నగర్, హైదర్ గూడ మీదుగా రామ్ కోటి షాలిమార్ ఫంక్షన్ హాల్ కు చేరుకుంది. అనంతరం ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం. నరసింహ అధ్యక్షతన జరిగిన భహిరంగ సభలో మొహమ్మద్ యూసఫ్ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని గౌరవించడానికి, న్యాయమైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితుల కోసం వారి పోరాటా లను స్మరించుకోవడానికి కార్మికుల హక్కుల పోరాటానికి చిహ్నంగా ‘మే డే’ జరుపుకుంటామని గుర్తు చేసారు.
మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు నిర్వహించవలసిన అవసరం ఉందని, ఇందుకు కార్మిక వర్గం సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మోడీ నేతృత్వంలోని బిజెపి-ఎన్డిఎ ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లను అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, మే 20, 2025న కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఈ నెల 20న తెలంగాణ రాష్ట్రంలో అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో కలసి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మొహమ్మద్ యూసఫ్ విజ్ఞప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. ప్రేమ్ పావని, కార్యదర్శులు ఎన్, కరుణకుమారి, మారగోని ప్రవీ ణ్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి, ఉప ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కిషన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. వెంకటయ్య, నేతలు ఏం. లక్ష్మి, ఏ. బిక్షపతి యాదవ్, రమేష్, రాజమౌళి, కొం రెల్లి బాబు, సిహెచ్. జంగయ్య, ఎస్. అశోక్, సిహెచ్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
త్యాగానికి ప్రతిఫలం మేడే
మలక్‌పేట్, మే 1 (విజయక్రాంతి): మేడే వేడుకలను పురస్కరించుకొని ఏక్తా జనశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గురువారం మే డే సందర్భంగా అధ్యక్షుడు రాజేష్ యాదవ్ మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా సాధించిన విజయం, త్యాగధనుల త్యాగానికి ప్రతి ఫలం ఉద్యమాలకు, పోరాటాలకు స్ఫూర్తి దాయకం అరుణపతాక రెపరెపలు ఆకాశమంతా నిండిన ఉత్సవమైన పేర్కొన్నారు.
కార్మికుల పండుగ రోజు అన్నారు. ఆడ, మగ తేడా లేక అందరూ కలిసి సాధించిన కార్మికుల అసలు సిసలైన స్వాతంత్య్ర దినం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఏ ఐలేష్, విట్టల్ రెడ్డి, అహ్మద్, కార్మికు రాలు యాదమ్మ, రేణుక పాల్గొన్నారు.
ముసారాంబాగ్‌లో : అంబేద్కర్ బహుజన సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ముప్పిడి ధనవంత్ అధ్వర్యంలో మూసారాంబాగ్‌లో జరిగిన మేడే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ప్రొ. డాక్టర్ రియాజ్ ముఖ్యతిధిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్మికు లకు అంబేద్కర్ గారు చేసిన కృషిని వివరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ హక్ కమర్, బోనగిరి చంద్రశేఖర్, ధర్మేందర్, ఆనంద్, వినోద్, భావన నిర్మాణ సంఘం అధ్యక్షులు అనంతయ్య ప్రభాకర్ చారి, భగత్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.