calender_icon.png 2 May, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన అంగన్‌వాడీ యూనియన్

02-05-2025 12:00:00 AM

గూడూరు. మే 1: (విజయ క్రాంతి)మే మాసం అంగన్వాడీ టీచర్లకు హెల్పర్స్ మినీ టీచర్స్ కు వేసవి సెలవులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కకు అంగన్వాడి యూనియన్ కృతజ్ఞతలు తెలిపారు.

బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రకటన వెలవడగా అంగన్వాడి యూనియన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను అంగన్వాడీ యూనియన్ సభ్యులు గురువారం కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే అందించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.