మెరుగైన వైద్య సేవలు అందించండి
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
మహబూబ్‌నగర్, ఆగస్టు 11 (విజయక్రాంతి): మెరుగైన వైద్య సేవలు అందించి విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా అదనం కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. దేవరకద్రలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాలలో పాము కాటుకు గురైన విద్యార్థి మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అదనపు కలెక్టర్ ఆసుపత్రిని మంగళవారం సందర్శించారు.
విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, అందుతున్న చికిత్స వివరాలను సమీక్షించారు. విద్యార్థి చికిత్సకు స్పందిస్తున్నాడని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు అదనపు కలెక్టర్కు తెలిపారు. విద్యార్థిని నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, అవసరమైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు.






